Maha Shivratri 2025: ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు, శివుడి పుణ్యక్షేత్రాలు భక్తల రాకతో సందడిగా మారాయి. ఈ ప్రత్యేకమైన పర్వదినాన భోలేనాథుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపవాసం, జాగారాలతో మహా శివుడిని ప్రసన్నం చేసుకుంటారు. కొంతమంది నిర్జలి ఉపవాసం పాటిస్తే మరికొందరు ఫల ఉపవాసం పాటిస్తారు. ఉపవాసంతో తో పాటు మహాశివుడి అనుగ్రహం కోసం రాత్రంతా జాగారం కూడా చేస్తారు కొందరు శివ భక్తులు. అయితే జాగారం చేసేటప్పుడు వెళ్లకుండా శివనామస్మరణలో ఉండడానికి శివుడికి సంబంధించిన ఈ సినిమాలను చూడండి.
భక్త కన్నప్ప
తెలుగు భక్తిరస చిత్రం 'భక్త కన్నప్ప'. దర్శకుడు బాపు తెరకెక్కించిన ఈ సినిమాలో కృష్ణంరాజు భక్తకన్నప్ప పాత్రను పోషించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథను స్వీకరించి ఈ సినిమాను తీశారు.
శ్రీ మంజునాథ
శ్రీ మంజునాథ' 2001 లో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం. ఈ సినిమా కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని కథపై ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివుడిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
మహాశివరాత్రి
శాంతి లాల్ సోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మీనా, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. శివ భక్తితో కూడిన ఈ చిత్రం ఆధ్యాత్మికతను పెంచుతుంది.
డమరుకం
నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'డమరుకం'. తనను నమ్ముకున్న వారి కోసం మహా దేవుడు ఎల్లప్పుడూ ఉంటారని ఈ సినిమాలో చూపించారు.
జగద్గురు ఆదిశంకర
'జగద్గురు ఆదిశంకర' చిత్రం 8వ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకర జీవితాన్ని వర్ణించే కథ. ఇందులో ఆదిశంకరాచార్య, నాగార్జున , మోహన్ బాబు , సుమన్ , శ్రీహరి మరియు సాయి కుమార్ టైటిల్ రోల్‌లో కనిపించారు.
Also Read: Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?