/rtv/media/media_files/2025/09/09/urmila-2025-09-09-14-09-46.jpg)
Urmila
ఊర్మిళ మటోండ్కర్(Urmila Mantodkar) కెరీర్‌లో మరిచిపోలేని సినిమా ‘రంగీలా’(Rangeela). 1995లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఊర్మిళను ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ సినిమాకు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా(30 Years for Urmila Rangeela Movie), ఊర్మిళ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రంగీలా రే’ పాటకు స్టెప్పులేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. మూడున్నర దశాబ్దాలు గడిచినా, ఆమె ఎనర్జీ, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోతో పాటు ఊర్మిళ తన మనసులోని మాటలను కూడా పోస్ట్ చేశారు.
Urmila Matondkar gives nostalgic treat to her fans as she dances to her Iconic Song ‘Rangeela Re’ as film completes 30 years#UrmilaMatondkar#rangeelare#rangeela#Bollywood#bollywoodnews#entertainment#EntertainmentNews#entertainmentindustry#bollywoodactresspic.twitter.com/cXm7BqZPKd
— Manchh (@Manchh_Official) September 9, 2025
"రంగీలా నా జీవితంలో ఒక సాధారణ సినిమా కాదు, అది ఒక గొప్ప అనుభూతి. ప్రతి సన్నివేశం, ప్రతి పాట నాకు ప్రత్యేకమైన గుర్తుగా ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయంలో ఒక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గుర్తొస్తే, ఆ మధురమైన క్షణాలన్నీ మళ్లీ కన్నుల ముందు కదలుతున్నట్లుంది.
Also Read : ఒక్క సీన్ కూడా వదిలి పెట్టరు!.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మలయాళ సినిమా
రంగీలా ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్..
మీ ప్రేమకు, ప్రోత్సాహానికి, నన్ను ఈ స్థాయికి తీసుకురావడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీరు చూపిన ప్రేమే నాకు పెద్ద ఆశీర్వాదం." ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. నెటిజన్లు, అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ స్పందిస్తున్నారు. "రంగీలా ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్", "ఊర్మిళ-ఆమిర్ జోడీ మర్చిపోలేం", "ఈ పాట వినగానే 90ల జ్ఞాపకాలు తిరిగొస్తున్నాయి" అంటూ అభిమానులు తమ ఫీలింగ్స్‌ను షేర్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. ప్రతి పాట ప్రేక్షకులను మాయ చేసేలా ఉండేది. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డ్యాన్స్‌లు అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
మొత్తానికి, ‘రంగీలా’ విడుదలై 30 ఏళ్లు గడిచినా, ఆ సినిమా మేజిక్ మాత్రం తగ్గలేదు. ఊర్మిళ చేసిన తాజా పోస్ట్ వలన ఆ రోజుల నాటి మధుర జ్ఞాపకాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : OG వైబ్స్.. "జపనీస్"లో కూడా మ్యూజిక్ అదరగొడుతున్న థమన్..