Kotha Lokah: ఒక్క సీన్ కూడా వదిలి పెట్టరు!..  బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మలయాళ సినిమా

ఈ మధ్య  బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ప్రమోషన్స్ ఇవేవీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి

New Update

Kotha Lokah: ఈ మధ్య  బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ప్రమోషన్స్ ఇవేవీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు లేకపోయినా కథలో దమ్ముంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపిస్తున్నాయి. తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ' కొత్త లోక'  సినిమాతో ఇది మరోసారి రుజువైంది. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

బ్లాక్ బస్టర్ హిట్.. 

కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ 7 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 185 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణుల అంచనా.  తెలుగులో ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. 11 రోజుల్లో $10 మిలియన్లు (దాదాపు ₹91 కోట్లు) వసూలు చేసింది. మలయాళ సినిమా చరిత్రలో ఇదొక అరుదైన రికార్డు. అంతేకాదు ఈ ఏడాది మలయాళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 'ఎల్ 2: ఎంపురాన్, తుడురాం మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. 'కొత్త లోక' మూడవ స్థానంలో ఉంది. 

సూపర్ హీరో ఫిల్మ్ 

ఒక సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి  డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  'వేఫేరర్ ఫిల్మ్స్' సంస్థ దీనిని నిర్మించింది.   అయితే ఇందులో సూపర్ హీరోగా నటి కల్యాణి దర్శిని నటించారు. సాధారణంగా సూపర్ హీరో ఫిల్మ్ అంటే హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ, ఇందులో హీరోయిన్ కి ఆ సూపర్ పవర్స్ ఉన్నట్లు చూపించారు దర్శకుడు. ఇందులో కళ్యాణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించాడు. 

Also Read: Ramu Rathod: తాండా నుంచి బిగ్‌బాస్ దాకా.. రాము రాథోడ్ జర్నీ చూస్తే ఫిదా!

Advertisment
తాజా కథనాలు