Thaman: OG వైబ్స్.. "జపనీస్‌"లో కూడా మ్యూజిక్ అదరగొడుతున్న థమన్..

పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న "ఓజీ" మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన సంగీతం ఇప్పటికే హైప్ సృష్టిస్తోంది. అయితే తాజాగా 'OG' నుండి జపనీస్ మ్యూజిక్ బీట్‌ ను విడుదల చేశాడు తమన్..

New Update
thaman og

thaman og

Thaman: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "OG". సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఓజస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌ రోల్‌లో ఆయన మెరవనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రతినాయకుడిగా శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే శ్రియారెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఓ బీజీఎం టీజర్ రిలీజ్ చేసిన తమన్, తాజాగా ఓ జపనీస్ మ్యూజిక్ బీట్‌ను విడుదల చేశారు. ఇది "ఓజీ" సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించనుందని ఆయన తెలిపారు.

మళ్లీ ట్రెండింగ్‌లోకి #HungryCheetah 

తాజాగా లండన్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో మ్యూజిక్ రికార్డింగ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా 117 మంది సంగీత కళాకారులు కలిసి పని చేస్తున్నారు. జపాన్‌కి చెందిన వాయిద్య పరికరం "కోటో" ఉపయోగించి ఓ ప్రత్యేక బీజీఎం తయారు చేశారు. ఇది వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే తమన్ ఈ అప్‌డేట్‌తో #HungryCheetah అనే హ్యాష్‌ట్యాగ్‌ మళ్లీ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లారు.

ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే ఖరారు అయింది. సెప్టెంబర్ 25, 2025న "ఓజీ" ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

పవన్ కల్యాణ్ నటిస్తున్న "ఓజీ" సినిమా మాస్ అండ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు