Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ

టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ (CID) విచారకు సిద్ధమైంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది.

Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ
New Update

TDP : టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ(CID) విచారకు సిద్ధమైంది. మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టం(Land Titling Act) పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిర్యాదు మేరకు అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్ పేరును చేర్చారు. అలాగే IVRS కాల్స్(IVRS Calls) చేసిన ఏజెన్సీ పైనా కేసు నమోదైంది.

Also Read: రానున్న 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు సిద్ధమైంది.  మరికాసేపట్లో టీడీపీ ఆఫీసుకు వెళ్లి దర్యాప్తు చేయనుంది. ఇదిలాఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయలు వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తమ పార్టీల మేనిఫెస్టోను ప్రకటించాయి. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఆసక్తిగా మారింది.

Also Read: ఎన్నికల వేళ కీలక పిలుపునిచ్చిన సీఎం జగన్.. ట్వీట్ వైరల్!

#andhra-pradesh #telugu-news #ap-tdp #cid #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe