CM Jagan : ఎన్నికల వేళ కీలక పిలుపునిచ్చిన సీఎం జగన్.. ట్వీట్ వైరల్!

ఏపీ సీఎం జగన్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంకోసం StarCampaignersగా వైసీపీలో చేరాలని స్వాగతించారు. https://navaratnaluplus.comలో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

New Update
EX CM Jagan: జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు!

AP : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంకోసం Star Campaigners గా వైసీపీలో చేరాలని స్వాగతించారు. ‘మీ జగన్ ఏకంగా 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తే.. చంద్రబాబు నేనూ అమలు చేశానని చెప్పలేక.. జగన్ పాలనలో అభివృద్ధి లేదంటూ విష ప్రచారం చేస్తున్నాడు. ఆ అబద్ధాల చంద్రబాబుకి, విషం చిమ్మే తోక పత్రికలు, టీవీలకి కళ్లు తెరిపించడానికి మీరంతా సిద్ధమేనా? వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’ అన్నారు.

Also Read : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా

అలాగే మరో ట్వీట్ లో.. ‘మా సుపరిపాలనలో లబ్ధిదారులందరూ నా #StarCampaigners. స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మార్చడంలో, మన ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో నాతో చేరాలని నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. @YSRCP పార్టీ రాబోయే ఎన్నికల కోసం. మేము మీ ఇంటి గుమ్మాన్ని సందర్శిస్తాము. ఈ సంస్కరణ, పరివర్తన ప్రయాణంలో మిమ్మల్ని స్వాగతిస్తాము! ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి దయచేసి https://navaratnaluplus.com ని సందర్శించండి’ అని కోరారు.

#cm-jagan #star-campaigners #ap-elctions-2024
Advertisment
Advertisment
తాజా కథనాలు