చంద్రబాబు కోర్టుకు ఆదేశాలను ఉల్లంఘించారా..ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా సీఐడీ కూడా కొన్ని షరతులను పెట్టింది. దానిపైనే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు...ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లే క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించలేదని సీఐడీతోపాటు ప్రభుత్వం కూడా భావిస్తోంది. మధ్యంతర బెయిల్ ఇస్తే ఈ ర్యాలీలు ఏంటని వైపీసీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ తప్పనిసరి అని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్నన్యాయమూర్తి ఎల్లుండికి తీర్పును వాయిదా వేసింది.
సీఐడీ వాదనలు ఇలా ఉన్నాయి:
-జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
-ఆ వీడియో క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్ లో కోర్టుకి సమర్పించిన సీఐడీ
-కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా చంద్రబాబు మీడియా తో మాట్లాడారు అని కోర్టుకు వెల్లడించిన సీఐడీ
-13 గంటల పాటు జైలు నుంచి రాజమండ్రి నుంచి ర్యాలీగా చంద్రబాబు విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపిన సీఐడీ
-ర్యాలీలు నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా చేశారన్న సీఐడీ.
చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ఇలా ఉన్నాయి:
-కోర్టు ఆర్డర్ ఎక్కడా చంద్రబాబు అతిక్రమించ లేదు.
-చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదు.
-జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయి.
-సీఐడీ చెబుతున్న షరతులు ఆయన్ని హక్కులు హరించే విధంగా ఉన్నాయని కోర్టుకు తెలిపిన చంద్రబాబు లాయర్లు.
ఇది కూదా చదవండి: నేను పోటీ చేయను.. తెలంగాణ బీజేపీకి మరో కీలక నేత షాక్!