/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-37-1.jpg)
Chiranjeevi Reveals His Conversation With Modi : జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ (PM Modi).. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వేదిక మధ్యకు తీసుకు వచ్చారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకుని ఇద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. దీంతో చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ బుగ్గలు నిమురుతూ సంబర పడిపోయారు. కాగా ఇదే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారో తెలుపుతూ చిరంజీవి తాజాగా పోస్ట్ రూపంలో బయటపెట్టారు.
Also Read : ‘కల్కి’ నుంచి దిశా పటాని పోస్టర్.. హాట్ లుక్ లో అదరగొట్టిన బ్యూటీ!
జరిగిన సంభాషణ ఇదే...
" ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, 'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.
కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని… pic.twitter.com/ZYg9YsSh6o— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024