Disha Patani : 'కల్కి' నుంచి దిశా పటాని పోస్టర్.. హాట్ లుక్ లో అదరగొట్టిన బ్యూటీ!

నేడు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'కల్కి2898AD' మూవీ టీమ్ ఆమెకు బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.

New Update
Disha Patani : 'కల్కి' నుంచి దిశా పటాని పోస్టర్.. హాట్ లుక్ లో అదరగొట్టిన బ్యూటీ!

Disha Patani First Look From Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD' కోసం సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న ఈ ట్రైలర్ లో ప్రభాస్ తో పాటూ కీ రోల్స్ ప్లే చేస్తున్న అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. పలువురుస్టార్స్ ని చూపించారు.

ఇప్పటికే వాళ్ళ క్యారెక్టర్ పేర్లు రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేయగా.. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరు 'రాక్సీ' అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.

Also Read : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు డుమ్మా.. కారణం అదేనా?

దీన్ని చూసిన నెటిజన్స్ దిశా ఈ లుక్ లో మరింత హాట్ గా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు