మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్‌ ఏమన్నారంటే..?

మంత్రి అంబటి రాంబాబుకు మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా కౌంటర్లు వేశారు. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నేతలు దృష్టి పెట్టాలని.. అంతేకాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇటివలి 'బ్రో' సినిమా గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. పవన్‌ రెమ్యూనరేషన్‌ చెప్పాలంటూ అంబటి అడగడం.. 'బ్రో' సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేయడం లాంటి పరిణామాల తర్వాత చిరు వ్యాఖ్యలు పవన్‌కు మద్దతుగా నిలుస్తుండడం మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది.

New Update
మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్‌ ఏమన్నారంటే..?

Chiranjeevi hot comments on YCP Minister Ambati Rambabu: పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు చురకలంటించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). వాల్తేరు వీరయ్య(Waltair veerayya) 200 డేస్ ఫంక్షన్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడాలంటూ కౌంటర్లు వేశారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని.. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించడంపై దృష్టి పెట్టాలంటూ పరోక్షంగా మంత్రి అంబటికి సెటైర్లు వేశారు. ఇలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని.. అసలు విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటంటూ ప్రశ్నించారు చిరు. ఇదేదో పెద్ద సమస్యల చూపించొద్దని. 'బ్రో'(Bro) సినిమాపై అంబటి వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్లు విసిరారు మెగాస్టార్.

మెగా ఫ్యాన్స్ ఆనందం?
రాజకీయాలకు చాలా డిస్టెన్స్‌ మెయింటైన్ చేస్తూ వస్తున్న చిరంజీవి ఇటివలి కాలంలో తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తమ్ముడికి అండగా చిరు నిలబడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇటివలి మంత్రి అంబటి వర్సెస్ పవన్ కల్యాణ్ 'బ్రో' వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 'బ్రో' సినిమాలో తన గురించే ఓ సీన్ పెట్టారని అందుకే మాట్లాడాల్సి వస్తోందంటూ ఫైర్ అవుతున్నారు అంబటి. త‌నను కించ‌ప‌ర‌చాల‌నే బ్రో సినిమాలో ప‌వ‌న్.. శ్యాంబాబు క్యారెక్ట‌ర్‌ను పెట్టాడ‌ని అంబ‌టి రాంబాబు ఆరోపిస్తున్నారు. అసలు పవన్(Pawan Kalyan) రెమ్యూనరేషన్‌ ఎంతో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సినిమాకు రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకున్నారో చెప్పలేని వ్యక్తి రాజకీయాల్లో పారదర్శకత ఎలా చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రచ్చ కాస్త ఢిల్లీ వరకు వెళ్లింది. 'బ్రో' సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయమని ఢిల్లీ వరకు వెళ్లారు అంబటి.

మెగా ఫ్యాన్స్ వర్సెస్ అంబటి:
రాజకీయంగా పవన్‌కు వైసీపీ బద్ద శత్రువు. వైసీపీ మంత్రులు పవన్‌ని టార్గెట్ చేయడం ఇదేం మొదటి సారి కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు వైసీపీ నేతలు. ఈసారి 'బ్రో' సినిమా విషయంలో ఈ రచ్చ మొదలైంది. సోషల్‌మీడియాలో చాలా రోజులుగా వైసీపీ మద్దతుదారులు, పవన్‌ ఫ్యాన్స్‌ గొడవపడుతున్నారు. ఇక 'బ్రో' మూవీతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌పై అంబ‌టి వ్యాఖ్యలను ఇండస్ట్రీ పెద్దలు కూడా తప్పుపడుతున్నారు. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను గాలి మాట‌లుగా ప్రొడ్యూస‌ర్ విశ్వ‌ప్ర‌సాద్ కొట్టిపడేశారు. ఇక వైసీపీ మంత్రులు పదేపదే హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతుండడం ఇండస్ట్రీ పెద్దలకు నచ్చడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చిరు చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా తమపై ఎందుకు పడుతున్నారని చిరు చేసిన కామెంట్స్ వెనుక కారణం అదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: అన్నయ్య మంచోడు.. తమ్ముడు మొండోడు..:హైపర్ ఆది

Advertisment
తాజా కథనాలు