India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే

ఇటీవల తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని తెలిపింది.

New Update
India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే

ఇటీవల భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూ చైనాకు కోపం తెప్పించింది. తమ పర్మిషన్ లేకుండానే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ మీడియా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల క్రితం ఓ ఆంగ్ల మీడియా సంస్థ తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. తైవాన్‌ పరిస్థితులు, దానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

Also read: అద్భుతం.. క్షణాల్లో వేలిముద్రలను గుర్తించే స్ప్రే..

వన్‌ చైనా ప్రిన్సిపల్‌కు విరుద్ధం

అయితే ఈ ఇంటర్వ్యూపై చైనా దౌత్య కార్యాలయం స్పందించింది. భారత మీడియా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆరోపణలు చేసింది. ఇది వన్‌-చైనా ప్రిన్సిపల్‌కు విరుద్ధమని తెలిపింది. ఇలాంటి వాటిని తాము ఎప్పటికీ అంగీకరించమని పేర్కొంది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే ఉందని.. తైవాన్‌ కూడా తమలో అంతర్భాగమేనని తెలిపింది. చైనా ప్రభుత్వమే మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించింది.

మీ చేతిలో కీలు బొమ్మలం కాదు

మరోవైపు ఈ వ్యవహారంపై తైవాన్‌ విదేశాంగ సైతం స్పందించింది. భారత్‌, తైవాన్‌లు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (PRC) లో అంతర్భాగాలు కాదని.. దాని కీలు బొమ్మలు కామని వ్యాఖ్యానించింది. పత్రిక స్వేచ్ఛ.. ఇరుదేశాల ప్రజాస్వామ్యాల్లో ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది.. అంతేగానీ పొరుగు దేశాలను వేధించకూడదంటూ చురకలంటించింది.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు