Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌ను కోరిన చైనా.. లేకపోతే..

పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది.

Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌ను కోరిన చైనా.. లేకపోతే..
New Update

ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట నిత్య దాడులు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని కోరింది. ఈ దాడులు ఆపకపోతే.. మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించే.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:  కదం తొక్కిన రైతులు.. ప్రధాన డిమాండ్లు ఇవే..

చర్యలు తీసుకోండి

అమాయక ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. ఇదిలాఉండగా.. గాజాలోని రఫాలో ప్రతిదాడులకు సిద్ధమవుతున్న హమాస్‌తో కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. వారం రోజుల క్రితం ఒప్పందం కోసం.. హమాస్‌ పెట్టిన నిబంధనలను తిరస్కరించిన ఇజ్రాయెల్‌ రఫాలో దాడులు కొనసాగిస్తోంది.

ఆందోళనకరం

ఇందులో ఇద్దరు బందీలనకు కూడా విడిపించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పయారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా రఫాపై జరిగిన దాడులను ఖండించారు. ఐక్యరాజ్యసమితి కూడా రఫాలో అమాయక ప్రజలు మృతి చెందడంతో ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: వణికిస్తున్న ఫ్లూ.. 15 వేల మంది మృతి..

#china #hamas-israel-war #gaza #rafah #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe