China:డబ్ల్యూహెచ్వోకు కొత్తరకం న్యుమోనియా మీద వివరణ ఇచ్చిన చైనా

చైనాలో ప్రబలుతున్న న్యూమోనియా కేసుల్లో అసాధారణ లేదా కొత్త వ్యాధికారక కారకాలు కనుగొనలేదని చైనా చెప్పిందని అంటోంది డబ్ల్యూహెచ్వో. దీని మీద వివరాణాత్మక సమాచారం ఇచ్చిందని తెలిపింది. అయితే కొత్త రకం న్యుమోనియా మీద మరింత డేటా ఇవ్వాలని బీజింగ్ ను కోరామని డబ్ల్యూహెచ్వో తెలిపింది.

New Update
China:డబ్ల్యూహెచ్వోకు కొత్తరకం న్యుమోనియా మీద వివరణ ఇచ్చిన చైనా

చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని పిల్లల ఆస్పత్రి, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇందులో చైనాలో ప్రస్తుతం ఉన్న మైక్రోప్లాస్మా న్యుమోనియా గురించి మొత్తం వివరాలను తెలిపిందని డబ్ల్యూహెచ్వో చెప్పింది. మరోవైపు అక్టోబర్ మధ్య నుంచి బీజింగ్, లియోనింగ్ లలో పిల్లలలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల మీద చైనా నిఘా వ్యవస్థల డేటాను కూడా డబ్ల్యూహెచ్వో పరిశీలిస్తోంది. మరింత డేటా కోసం బీజింగ్‌‌ను కోరినట్టు ప్రకటించింది. అయితే దీని మీద బైనా ప్రభుత్వం మాత్రం ఏ ప్రకటనా విడుదల చేయలేదు.

Also read:ఉత్తరాఖండ్ సొరంగంలో మళ్ళీ ఆగిన డ్రిల్లింగ్ పనులు

బీజింగ్, లియోనింగ్‌లలో పిల్లల బాధపడుతున్న న్యుమోనియాలో అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించలేదని చైనా అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వైరస్ లో ఒకటి కంటే ఎక్కువ వ్యాధి కరకాలుఉన్నాయని దబ్ల్యూహెచ్వో అంటోంది. ప్రస్తుత పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. చైనా అధికారులతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. మరోవైపు తాము అడిగినట్టుగా కొత్త డేటాను ఇవ్వడానికి చైనా ఒప్పుకుందని డబ్ల్యూహెచ్వో అధికారులు తెలిపారు. చైనాలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశామని అన్నారు. ఫ్లూ, కోవిడ్-19,ఇతర శ్వాసకోశ వ్యాధికారక వైరస్‌లను నిరోదించే వ్యాక్సిన్ లను తీసుకోవాలని అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచడం, వైరస్ ఉన్నవారిని ఇంట్లోనే ఉంచడం, మాస్క్‌లు ధరించడం వంటివి చేయాలని డబ్ల్యూహెచ్వో చైనాకు సూచించింది. ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ లలో స్కూళ్ళను తాత్కాలికంగా మూసివేశారు. అయితే చైనాకు టూరిజంకు మాత్రం అడ్డకట్ట వేయడం లేదని చెబుతోంది.

Also Read:యుద్ధ విరమణకు వేళాయే.. నేటి నుంచే బందీల విడుదల

Advertisment
తాజా కథనాలు