Chennai : తమిళనాడు(Tamil Nadu) లోని చెన్నై(Chennai) లో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. బస్సులో వెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు(Woman Passenger) పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ బస్సులో ఒక్కసారిగా రంధ్రం పడటంతో ఆమె కిందపడిపోయింది. చివరికి తృటిలో ఆమె తప్పించుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటూ ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైన్నైలోని వల్లలార్ నగర్ నుంచి తిరవెర్కాడు మధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్(Metropolitan Transport) కార్పొరేషన్ బస్సులో ఓ మహిళ ఎక్కింది.
Also read: మంచి పనులు చేసే వాళ్లకి గౌరవం దక్కడం లేదు: నితిన్ గడ్కరీ
బస్సుకు రంధ్రం
ఆ బస్సు చివర్లో ఉన్న 59వ నెంబర్ సీట్లో కూర్చుంది. బస్సు అమింజికరై అనే ప్రాంతం సమీపానికి రాగానే.. ఆ మహిళ తాను కూర్చున్న సీటు నుంచి పైకి లేచింది. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా బస్సు ఫ్లోర్ కూలి పెద్ద రంధ్రం పడింది. దీంతో ఆ మహిళా కూడా రంధ్రం గుండా కిందపడిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించారు.
వీడియో వైరల్
వెంటనే ఆయన బస్సును ఆపేశారు. అయితే ఆ మహిళా కదులుతున్న బస్సు రంధ్రం నుంచి రోడ్డుపై పడ్డప్పటికి కూడా ఆమెకు చిన్నపాటి గాయాలు కావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. ఆమెను చూసి అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతోంది. నెటీజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయ్యండి.
Also Read: హైదరాబాద్ విద్యార్థిపై అమెరికాలో దాడి.. ప్రభుత్వానికి అతని భార్య లేఖ..