Leopard in Tirumala: తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం మేరకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also read: టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..!
రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది చిరుత జాడలను గుర్తించే పనిలో పడ్డారు. భద్రతా సిబ్బంది భక్తులను ఒంటిరిగా కాకుండా గుంపులు, గుంపులుగా పంపుతున్నారు. ఇటీవల కూడా అలిపిరి నడకమార్గంలో చిరుతలు సంచరించడం కలకలం రేపింది. వాటి నుంచి రక్షణ కోసం టీటీడీ సిబ్బంది భక్తులకు కర్రలు ఇచ్చారు. అయితే పలుమార్లు చిరుతలు భక్తుల కంట పడటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఏపీ అలర్లు..150 పేజీలతో ప్రాథమిక నివేదిక.. 33 కేసులు, 1370 మంది నిందితులు..!