Movies: తేజ సజ్జా కోసం మిరాయ్ స్క్రిప్ట్‌లో మార్పులు

దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్, తేజ సజ్జా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. హుమాన్ సినిమా తర్వాత ఈ మూవీకి సంతకం చేశాడు తేజ సజ్జా. కానీ హనుమాన్ సినిమాతో ఇతనికి విపరీతంగా పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు మిరాయ్ స్క్రిప్ట్‌లో ఛేంజెస్ చేస్తున్నారని టాక్.

Movies: తేజ సజ్జా కోసం మిరాయ్ స్క్రిప్ట్‌లో మార్పులు
New Update

Teja Sajja: హనుమాన్ మూవీ...సూపర్ డూపర్ హిట్ అయింది.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్లకుపైగా రాబట్టింది. ఈ సినిమాతో ఇందులో నటించిన తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు వచ్చిన ఓ బేబీ, జాంబీ రెడ్డిలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ నటుడు ఇప్పుడ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో తనకు వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవాలని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు తేజ. ప్రస్తుతం ఇతని చేతిలో హనుమాన్-2, మిరాయ్ సినిమాలున్నాయి. ఇందులో హనుమాన్ -2 కంటే ముందే మిరాయ్ మూవీకి సైనప్ చేశాడు హీరో.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా షూటింగ్ కూడా సగం అయిపోయింది. ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. అయితే ఇందులో ఇంతకు ముందు తేజ పాత్ర కొంచెం చిన్నదిగా ఉండేదిట. ఇప్పుడు హనుమాన్‌తో అతనికి ఫుల్ క్రేజ్ రావడంతో అతని పాత్రను మరింత పెంచాలని మూవీ టీమ్ అనుకుంటోంది. కొత్త షెడ్యూల్ మొదలయ్యేలోపు స్క్రిప్ట్‌ను మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గోవాలో మిరాయ్ టోటల్ స్క్రిప్ట్ కు మరమ్మతులు చేస్తున్నారట. కొత్తగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను యాడ్ చేస్తున్నారట. ఇప్పటికే షూట్ చేసిన సీన్లను కూడా రీషూట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే మాత్రం ఇంకా రాలేదు.

40 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మిరాయ్ సినిమాను నిర్మిస్తున్నారు.దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు.

Also Read:National: రాజ్యసభ మెంబర్‌గా సుధామూర్తి ప్రమాణం

#manchu-manoj #teja-sajja #hanuman #dulquar-salman #miray #movies
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe