Chandrayaan-3: ''వెల్కమ్‌ బడ్డీ''..విక్రమ్‌ కి స్వాగతం చెప్పిన ప్రదాన్‌!

ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్‌ 2 కు చెందిన ఆర్బిటార్‌ ప్రదాన్‌ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్‌ కు వెల్కమ్‌ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్‌ లో పేర్కొంది. ''వెల్కమ్‌ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్‌ లో పోస్టు చేశారు.

Chandrayaan-3: ''వెల్కమ్‌ బడ్డీ''..విక్రమ్‌ కి స్వాగతం చెప్పిన ప్రదాన్‌!
New Update

Chandrayaan-2 orbiter welcomes Chandrayaan-3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ చంద్రయాన్ -3. దీని గురించి యావత్‌ భారతదేశం ఎంతో గర్వంగా ఉంది. రష్యా లూనా కుప్పకూలిన తరువాత ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ 3 మీదే దృష్టి పెట్టింది. చంద్రయాన్‌ 3 మిషన్‌ లో భాగంగా వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)చంద్రుని ఉపరితలానికి అతి చేరువలో ఉంది.

బుధవారం సాయంత్రానికి చంద్రుని పై ఆ ల్యాండర్‌ దిగుతుంది. ఈ క్రమంలో ఇస్రో (ISRO) ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్‌ 2 (Chandrayaan-2) కు చెందిన ఆర్బిటార్‌ ప్రదాన్‌ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్‌ కు వెల్కమ్‌ చెప్పింది.


ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్‌ లో పేర్కొంది. ''వెల్కమ్‌ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్‌ లో పోస్టు చేశారు. చంద్ర‌యాన్‌-2 ఆర్బిటార్‌, చంద్ర‌యాన్‌-3 ల్యాండ‌ర్‌తో టూ వే క‌మ్యూనికేష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు ఇస్రో తెలిపింది. ఆగ‌స్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్ర‌మ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్ ఉంటుంద‌ని ఇస్రో వెల్ల‌డించింది.

ఆగస్టు 21న చంద్రయాన్ 3 ల్యాండర్‌ మాడ్యూల్‌ లోని ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ కెమెరా తో తీసిన కొన్ని చంద్రుని చిత్రాలను ఇస్రో పంచుకుంది. ఈ కెమెరా చంద్రుని మీద ఉన్న సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో చంద్రయాన్‌ 3 కి సహాయం చేయనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా బండరాళ్లు లేని ల్యాండింగ్‌ ప్రాంతం కోసం వెతకడానికి కెమెరా సాయపడనున్నట్లు ఇస్రో పేర్కొంది.

ఆగస్టు 17న, ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ రెండు కూడా విడిపోయాయి.ప్రొపల్షన్‌ మాడ్యూల్ మిషన్‌ జీవితం సుమారు మూడు నుంచి ఆరు నెలలు వరకు ఉండగా, ల్యాండర్‌ మ్యాడుల్‌ 14 ఎర్త్ డేస్‌ లేదా ఒక లూనార్‌ డే మాత్రమే పని చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్ర కక్ష్యలో ఒక సంవత్సరం వరకు తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ISRO ఆగస్టు 17న ట్విట్టర్‌ లో రాసింది.

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినట్లయితే, చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారతదేశం అవుతుంది.

Also Read: చంద్రయాన్‌ గెలిచింది..రష్యా ఓడింది.. ఇది ఇండియా గెలుపే బాసూ!

#chandrayan-3 #chandrayaan-3-latest-news #isro #vikram #vikram-lander #isro-chandrayaan-3 #welcome-buddy #pradan #chandrayaan-2-orbiter-welcomes-chandrayaan-3
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe