Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
చారిత్రాత్మక ఘట్టానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 మిషన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.