టాప్ స్టోరీస్ Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే.. నిజంగా గ్రేట్ భయ్యా! చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపడం వెనుక ఉన్న రియల్ హీరోలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ముందుండి నడిపిన వారిలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్, U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శంకరన్, VSSC డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, మిషన్ డైరెక్టర్ మోహన్న కుమార్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్ రాజరాజన్ ఉన్నారు. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: ఇదిరా ఇండియా అంటే.. ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా! ప్రపంచం మొత్తం ఇస్రోకి సలాం కొడుతోంది. భారత్‌పై కారణం లేకుండా కస్సుబుస్సుమనే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం ఇస్రో సాధించిన విజయాన్ని కీర్తించకుండా ఉండలేపోతున్నాయి. అమెరికా, యూకే, అరబ్ దేశాల మీడియా సంస్థలు తమ వెబ్‌సైట్స్‌లో బ్యానర్ ఐటెమ్‌గా చంద్రయాన్-3 విజయం గురించే పెట్టుకున్నాయి. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: దటీజ్ ఇస్రో... చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. జాబిల్లిపై రహస్యాలను ఛేదించడానికి చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత... చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రయోగాన్ని టీవీల్లో చూస్తు ల్యాండింగ్ సక్సెస్ అవ్వాలని ఊపిరి బిగబట్టిన భారతావని ఆనందంతో కేరింతలు కొడుతోంది. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Chandrayaan-3: ఇస్రోలో జాబ్ తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుత ఉద్యోగ అవకాశాలేంటి? ఇస్రో(ISRO)లో జాబ్ చాలా మంది కల. చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ వేళ ఇస్రో జాబ్స్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' , ఫైర్‌మెన్ 'ఏ' లాంటి జాబ్స్‌కి రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ని వీక్షించనున్న మోదీ..! దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ అవ్వనుంది. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: ''వెల్కమ్ బడ్డీ''..విక్రమ్ కి స్వాగతం చెప్పిన ప్రదాన్! ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Former Chief ISRO: ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు..!! అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం చేస్తూ ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ఓ హాలివుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారక మిషన్ ను విజయవంతంగా చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించింది భారత్. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో ముందుకు దూసుకెళ్తోంది. చంద్రయాన్ -3 విషయంలో కూడా ఆదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఈ ప్రయోగాలపై ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ స్పందించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు భారీ రాకెట్లు అవసరమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3 : ఆ విషయంలో చైనా కంటే ఇండియానే తోపు...!! అంతరిక్షంలో ఇండియా దూసుకుపోతుంది. అంతరిక్షంలో ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్న అగ్రదేశాలకు సైతం..సవాల్ విసురుతూ ఇండియా సత్తా చాటుతోంది. చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. By Bhoomi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn