స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరికొన్ని అదనపు షరతుల విషయంలో సీఐడీ అనుబంధ పిటిషన్ వేసింది. దీని మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొత్త విషయాలు చెప్పొద్దని...గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది. అయితే చంద్రబాబు ర్యాలీలో పాల్గొనకూడదని, ఈ కేసుకు సంబంధించి మీడియాలో ఎక్కడ మాట్లాడకూడదని అన్న షరతులను మాత్రం తప్పనిసరిగా పాటించాలని మరోసారి కోర్టు స్పష్టం చేసింది.
Also read:పారిజాత, కెఎల్ఆర్ ఇళ్ళల్లో దొరికిందెంత?
స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీని మీద అదనంగా ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చినందున ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా అదనపు షరతులు విధించాలని సీఐడీ పిటిషన్ వేసింది. చంద్రబాబు కార్యకలాపాలను పరిశీలించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో పేర్కొంది. అయితే వీటిని వేటినీ హైకోర్టు ఒప్పుకోలేదు.
మరోవైపు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అజయ్ కల్లం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మిని విచారించాలని ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.