Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు!

టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్‌ఎస్‌ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు.

Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు!
New Update

Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం, అలాగే మరో మంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ (Nara Lokesh) కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నందున్న ఈసారి కూడా ఐటీ, పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: యెడియూరప్పకు బిగ్‌ షాక్.. అరెస్టు చేసేందుకు కోర్టుకు సీఐడీ

టీడీపీ లాంటి పలు ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో సీఎంగా పనిచేసిన నేతలు కూడా తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్ధవ్‌ ఠాక్రే తన కొడుకు ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి ఇచ్చారు. పంజాబ్‌లో అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. తన కొడుకు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను డిప్యూటీ సీఎంను చేశారు. అలాగే 2006 నుంచి 2011 వరకు తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఎం.కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 నుంచి 2011 వరకు ఆయన కొడుకు స్టాలిన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా తన కొడుకు కేటీఆర్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ అప్పగించిన సంగతి తెలిసిందే.

అయితే మరో రెండు ప్రాంతీయ పార్టీలైన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబ సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేకపోయారు. బీహార్‌లో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి ఇద్దరూ కూడా చాలా కాలం పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ వారి పదవీకాలంలో.. వాళ్ల కుటుంబసభ్యులు ఎవరూ కూడా మంత్రివర్గంలో లేరు. అలాగే ఎస్పీ అధినేత ములాయం సింగ్ కూడా ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సైతం తన పదవీకాలంలో కొడుకు అఖిలేష్ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు. అంతేకాదు ఆఖరికీ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. తన కొడుకు రాహుల్‌ గాంధీకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. కనీసం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేయలేకపోయారు. దీంతో రాహుల్‌కి గతంలో ప్రజల్లో అంతగా ఆదరణ ఉండేది కాదు. భారత్‌ జోడో యాత్ర తర్వాత రాహుల్‌ గ్రాఫ్ పెరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

Also Read: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్, కిషన్ రెడ్డి

#tdp #stalin #chandrababu-naidu #kcr #rahul-gandhi #sonia-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe