/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-37.jpg)
Chandra babu Metting With Amith Shah: రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే ముఖ్యఅతిథులుగా విజయవాడకు చేరుకుంటున్నారు. వారందరికీ గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ, విజయవాడలోనూ కూడా ఘనస్వాగతం లభిస్తోంది. ఇక కేంద్రమంత్రి అమిత్ షా కూడా విజయవాడకు చేరుకున్నారు. ఈయనను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పు పై చర్చ చేయనున్నారు. ఇప్పటికే ఎంత మంది మంత్రులు ఉంటారు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలన్నదానిపై చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు అమిత్ షాతో మాట్లాడిత తర్వాత ఈ లిస్ట్‌ను ఫైనల్ చేయనున్నారు.
కాసేపట్లో బీజేపీ జనసేన మంత్రుల పై కూడా బాబు నిర్ణయం తీసుకోనున్నారు. అమిత్ షాతో భేటీలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక సమావేశం తర్వాత టీడీపీ మంత్రుల అభ్యర్థులపై కూడా ఒక క్లారిటీ రానుంది. అనంతరం అర్ధరాత్రి కాబోయే మంత్రులకు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి శాఖలు, కేటాయింపుల విషయం చెప్పనున్నారని సమాచారం.
Also Read:Vijayawada: విజయవాడ చేరుకున్న చిరంజీవి కుటుంబం, రజనీకాంత్
Follow Us