TDP: ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ..

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.

New Update
TDP: ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ..

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం. జనసేనతో సంబంధం లేకుండా తెలుగు దేశం పార్టీకి చెందిన వారిని ఎన్నికల భరిలో నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కడప జిల్లాకు టీడీపీ ఇంఛార్జిని నియమించారు చంద్రబాబు. ఇందుకు సంభందించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్‌ఆర్‌ కడప టీడీపీ ఇన్‌ఛార్జిగా ఆర్‌, మాధవీరెడ్డిని నియమించిన ఆయన.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజ‌నేయుల్ని నియ‌మించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా కడపలో చంద్రబాబు మహిళా అభ్యర్థిని నియమించడం చర్చనీయంశంగా మారింది. మరోవైపు ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నా చంద్రబాబు నాయుడు అప్పుడే అభ్యర్థులను ప్రకటించడంతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్నికల సంఘ అధికారులను కలిశారు.

దీంతో రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని చంద్రబాబు భావించారని అందుకే టీడీపీ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ అవినీతి పార్టీ గురించి గ్రామ స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నాయకుల ఆగడాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం అవినీతిలో అభివృద్ధి చెందని అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జగన్‌ చేసిన దోపిడీలను గమనిస్తున్నారన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో ప్రజలే జగన్‌కు బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు