Temple Tourism:నిన్నటి మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పర్యాటకానికి ప్రోత్సాహం అందిస్తామని..లక్షద్వీప్‌తో సహా దేశం మొత్తం పర్యాటక ప్రదేశాలకు సౌకర్యాలను పెంపొందిస్తామని అన్నారు. ఇతర దీవుల్లో పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, ఇతర సౌకర్యాల కోసం ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.దాంతో పాటూ ఆధ్యాత్మిక దేశమైన భారత్‌లో పర్యాటకానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆద్యాత్మిక ప్రదేశాల్లో ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ప్రకటించారు.
Also read:Jharkhand:జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో అరడజనుకుపైగా ప్రసిద్ధ, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కేంద్రం కనుక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. తెలంగాణ టెంపుల్ టూరిజం హబ్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం, యాదాద్రి వంటివి ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమిస్తున్నాయి. వీటితో పాటూ రాష్ట్రంలో వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం, బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం, అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వరంగల్‌లోని రామప్ప, భద్రకాళి ఆలయాలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఇంకా బోలెడు ఇతర చిన్న పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పండగ సీజన్లలో మరీ ఎక్కువ కూడా ఉంటుంది. అయితే ఫేమస్ టెంపుల్స్‌లో తప్పి మిగతా చోట్ల పెద్దగా వసతులు లేవు. వేములవాడ వంటి చోట కూడా సరైన వసతులు లేవు. యాదాద్రి, భద్రచాలం వంటి ఆలయాలను మినహాయిస్తే.. చాలా ఆలయాల్లో మౌలిక సదుపాయాలు లేవు. యాత్రికుల కోసం కాటేజీలు, భోజనశాలలు, హోటల్స్ లాంటివి లేవు. ఇక్కడకు ఎవరెళ్ళినా దర్శనం చేసుకుని వెంటనే వచ్చేయడమే తప్పితే తిరుతిలా అక్కడే రెండు, మూడు రోజులు ఉండే ఛాన్స్ అస్సలు లేదు. ఇది బయట ఊళ్ళ నుంచి, రాష్ట్రా నుంచి వచ్చేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది.
ఇప్పుడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు ఈ బాధలు తప్పే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారే ఛాన్స్ ఏర్పడింది. కేంద్రం చెప్పిన విధంగా పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేస్తే.. పర్యాటకంగా అభివృద్ది సాధించటంతో పాటు ఆలయాలకు ఆదాయం పెరుగుతుందని ఎండోమెంట్ అధికారులు అంటున్నారు. పలువురు ఉపాధి పొందటమే కాకుండా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.