Jharkhand CM: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరేన్ ప్రమాణం స్వీకారం చేశారు. హేమంత్ సోరేన్ స్థానంలో చంపా సోరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటూ మిత్ర పక్షాలకు ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. By Manogna alamuru 02 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Champai Soren Takes Oath as Jharkhand CM: జార్ఖండ్‌లో రాజకీయాలు మంచి రసవత్తరంగా ఉన్నాయి. ఈ వేడిలోనే అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపయ్ సోరెన్ (JMM Champai Soren) ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీ రాజభవన్‌లో గవర్నర్ పి. రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. Also read:Vijayawada:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ హైదరాబాద్‌కు ఎమ్మెల్యేల తరలింపు.. అయితే ఝార్ఖండ్‌లో ఇంకా రాజకీయ అనిశ్చితి తొలగలేదు. ఇక్కడ అసెంబ్లీలో త్వరలోనే బలపరీక్ష జరగనుంది. బలనిరూపణకు కొత్త ముఖ్యమంత్రికి 10 రోజులు గడువు ఇచ్చారు గవర్నర్. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. ఫిబ్రవరి 5న చంపై సోరెన్ మెజార్టీ నిరూపించుకునే ఛాన్స్ ఉండడంతో...ఈలోపు పార్టీలో ఏ మార్పులూ జరగకుండా ఉండేందుకు జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. ఈ ఎమ్మెల్యేలను బీజేపీ (BJP) కొనేయనుందనే వార్తలు రావడంతో ఈ యాక్షన్ తీసుకుంది జేఎంఎం. రాంచీ నుంచి రెండు ప్రైవేట్ విమానాల్లో నేతలను హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. JMM और कांग्रेस के विधायक रांची से हैदराबाद जा रहे। विश्वास मत तक वहीं रहेंगे pic.twitter.com/1n358W8QYT — Narendra Nath Mishra (@iamnarendranath) February 2, 2024 జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం 41 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ప్రస్తుతం మహాకూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో ఎమ్మెల్యేలకు బస ఇచ్చారు. సుప్రీంలో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను (Hemant Soren) తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధం అని, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగంఇచడమే అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించిన కోర్టు… ఈడీ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోమేలని తేల్చి చెప్పింది. సీజేఐ డీవీ చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేది ధర్మసనం పిటిషన్‌ను తిరస్కరించింది. ముందుగా హైకోర్టుకు వెళ్ళాలని ధర్మాసనం సూచించింది. #champai-soren #jharkhand #jharkhand-cm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి