Kishan Reddy : తెలంగాణ(Telangana) లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP)తో కలిసి జనసేన పోటీ చేసిన సంగతి తెలసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బీజేపీ నేతలతో కలిసి ప్రచారం చేశారు. 8 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. 'ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలో దిగాం.
Also Read: ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన పెరిగిన రద్దీ..
అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని' కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also read: మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ ఘటన.. అసలు నిజం ఇదే..