విగ్రహం ధ్వంసం ఘటనపై కిషన్ రెడ్డి కామెంట్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక నాయకులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. బండి సంజయ్ తనకు గుంట భూమి కూడా లేదని అఫిడవిట్లో తెలపగా.. కిషన్ రెడ్డికి 8.28 ఎకరాల భూమి ఉంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో మండలాధ్యక్షులు, ఆపై నేతలతో నిర్వహించే సమావేశానికి అమిత్ షా, తరుణ్ చుగ్ తో పాటు అగ్రనేతలు హాజరవుతారన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇలా ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
తాము 22 స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటున్నారు. ఒక వేళ బీజేపీ లెక్కలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఓటర్లను కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సర్వేలను చిత్తు చేస్తూ డిసెంబర్ 3న బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ ప్రజలను ఆకర్షిస్తోందన్నారు కిషన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను బీజేపీలోకి చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో సమావేశమై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. అయితే.. అలాంటిదేమీ లేదని నవీన్ యాదవ్ చెబుతున్నారు.