Madhya Pradesh: కారులో బాలికపై అత్యాచారం..వీడియో తీసి బ్లాక్ మెయిల్ ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమ్మాయిలు, ఆడవారి మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 13 బాలికను కొందరు యువకులు అత్యాచారం చేశారు. వివరాలు కింద చదవండి... By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 13 Years Girl Raped: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఏడాది కిందట చినూర్‌కు చెందిన ఒక యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతడు తన ఇద్దరు స్నేహితులను ఆమెకు పరిచయం చేశాడు. దీంతో వారు సోషల్ మీడియాలో చాట్ చేసుకున్నారు. జూన్ 1న బాలిక స్నేహితుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వచ్చారు. ఆమెను పిలిపించి కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా వెనుక సీటులో ఉన్న బాలికపై ఆమె ఫ్రెండ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ పక్క సీటులో కూర్చొన్న మరో వ్యక్తి మొబైల్‌లో దీనిని రికార్డ్ చేశాడు. అనంతరం నిందితుడు వీడియో చూపించి ఆ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఆమె మాట వినకపోవడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధిత బాలిక జరిగిన సంఘటనను తన కుటుంబానికి చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితులంతా 18 నుంచి 20 ఏళ్ల యువకులని పోలీస్ అధికారి వెల్లడించారు. Also Read:ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష – బడ్జెట్ సమావేశాలపై చర్చ #13yeras-girl #madhya-pradesh #rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి