Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. పారా బాయిల్డ్‌ రైస్ సేకరణకు ఆమోదం..

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు ఆమోదం తెలిపింది.

New Update
Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. పారా బాయిల్డ్‌ రైస్ సేకరణకు ఆమోదం..

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. పియూష్‌ గోయాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన..!

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, రూ. 500 బోనస్‌ను చెల్లించాలని.. రైతుల నుంచి వరిధాన్యాన్ని వెంటనే సేకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also read: మందుబాబులకు బిగ్ షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు