Election Commission: ఓటుకు ఆధార్‌ తప్పనిసరి కాదు..కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ !

ఆధార్‌ కార్డు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు కార్డు,లేక ఏ ఇతర చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనుమతినిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది.

Election Commission: ఓటుకు ఆధార్‌ తప్పనిసరి కాదు..కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ !
New Update

Election Commisssion: ఓటరు (Voter) నమోదు చేసుకునేందుకు ఆధార్‌ కార్డు (AAdhar Card) తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం (Central election Commission) తెలిపింది. ఆధార్‌ కార్డు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని టీఎంసీ(TMC) కి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు కార్డు,లేక ఏ ఇతర చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనుమతినిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది.

తృణమూల్‌ ఎంపీలు పశ్చిమ బెంగాల్ లో వేల సంఖ్యలో ఆధార్‌ కార్డులను డియాక్టివేట్‌ చేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌ లో ఆధార్‌ కార్డుల డీయాక్టివేషన్‌ కావడం ఇదే మొదటి సారి అని టీఎంసీ నేతలు మీడియాకు వివరించారు.

ఇలా ఆధార్ డీయాక్టివేషన్ అయితే ఓటు వేసే అవకాశం కోల్పోయే ఛాన్స్‌ ఉన్నట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. అయితే అలాంటి భయాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈసీ హామీ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టేలా కేంద్ర బలగాలు వ్యవహరించాయని ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని ఈసీని టీఎంసీ నేతలు కోరారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగం గురించి ప్రజలకు తెలియజేసి పోలింగ్‌ శాతాన్ని పెంచేలా ప్రయత్నం చేయాలని తెలిపింది. దీని కోసం ఎలక్షన్‌ కమిషన్‌ బ్యాంకులు, పోస్టాఫీస్ లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అందుకోసం వాటితో ఈసీ ఒప్పందం కుదుర్చుకుంది.

Also read:  మరోసారి కర్ణాటకలో మంకీ ఫీవర్‌ కలకలం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య!

#aadhar #vote #election-commission #west-bengal #tmc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe