పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వైద్యురాలిపై సామాజిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధరించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కూడా తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Kolkata Doctor Case: వైద్యురాలి అత్యాచార ఘటన.. గ్యాంగ్‌రేప్ జరగలేదన్న సీబీఐ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించింది. దర్యాప్తు తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.
Translate this News: