Kolkata Doctor Case: వైద్యురాలి అత్యాచార ఘటన.. గ్యాంగ్‌రేప్ జరగలేదన్న సీబీఐ

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించింది. దర్యాప్తు తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.

New Update
Kolkata Doctor Case: వైద్యురాలి అత్యాచార ఘటన.. గ్యాంగ్‌రేప్ జరగలేదన్న సీబీఐ

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వైద్యురాలిపై సామాజిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధరించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కూడా తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

Also Read:  నేడు కాంగ్రెస్‌లోకి వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా

ఇదిలాఉండగా.. హత్యాచార ఘటన జరిగిన అనంతరం ముందుగా ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇదే సమయంలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్‌ జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో కోల్‌కతా హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. అయితే కేసు పురోగతి గురించి సీబీఐ నుంచి ఇంతవరకు ఎలాంటి వివరాలు రాలేదని సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాన్ని బయట పెట్టింది. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.

ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్‌లో పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా ఉండటాన్ని గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ముందు వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. కానీ దర్యాప్తులో ఇది హత్యాచార ఘటన అని తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సీబీఐ సంజయ్‌ రాయ్‌పై పాలీగ్రాఫ్ టెస్టు కూడా నిర్వహించింది. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

Also Read: ఆర్బీఐ క్విజ్… ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా!

Advertisment
తాజా కథనాలు