CBI Investigation : కోల్‌కతా డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రంగలోకి దిగడంతో పరిణామాలు మారుతున్నాయి. ఆర్జీ కార్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వరుసగా మూడోరోజు సందీప్‌ను విచారిస్తోంది. ఈ దారుణ ఘటనలో కళాశాల యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మరోవైపు తమ కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ?
ఈ ఘటన వెనుకున్న పెద్ద తలకాయల పేర్లు బయటికి రాకుండా సంజయ్ రాయ్‌ను కేసులో ఇరికించి కేసును ముసివేయించే కుట్ర చేస్తున్నారని చెబుతున్నారు. మెడికల్ మాఫియాకు సంబంధించిన ఫిర్యాదు వస్తుందనే భయంతోనే తమ కూతురుని రేప్ చేసి చంపారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
Also read: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్!
ఇదిలాఉండగా.. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ ఇటీవల RG కర్ మెడికల్ ఆస్పత్రి (RG Kar Medical Hospital) లో రాత్రి విధుల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సెమినార్ హాల్‌లో ఆమె అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జి (Mamata Banerjee) కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్నారు.