Andhra Pradesh:ఆంధ్రాలో కులగణన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతీగామంలోని వాలంటీర్లు దీనిని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి వాలంటీర్లు సర్వే చేస్తున్నారు. పదిరోజుల పాటూ జరగనున్న కులగణన సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. By Manogna alamuru 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Caste-Census-2024:ఏపీలో కులగణన ప్రక్రియ షురూ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కులగణన సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వరకు 10రోజుల పాటు కులగణన చేయనున్నారు. ప్రతీ గ్రామంలోని నియమించబడిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళీ ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ 10రోజుల్లో అందుబాటులో లేనివారికి ఫిబ్రవరి 2 వరకు సచివాలయాల్లో కులగణన నమోదుకు అవకాశం కల్పించారు. కులగణన సర్వే మొత్తం ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగ ఆరూపొందించిన యాప్‌లో సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. Also read:వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు డేటా ప్రకారం కులగణన.. రాష్ట్రంలో గ్రామ, వార్డు స్థాయి సచివాలయాల ద్వారా సేకరించిన డేటా ప్రకారం గ్రామాల్లో మొత్తం 1 కోటి 23 లక్షల 440 వేల 422 మంది కుటుంబాలు, 3 కోట్ల 56 లక్షల 62 వేల 251 మంది నివాసమున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 44 లక్షల 44 వేల 887 కుటుంబాలు, 1 కోటి 33 లక్షల 16 వేల 91 మంది ఉన్నారు. వీరందరిలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారో అధికారికంగా డేటా సేకరిస్తున్నారు. దీని కోసం కుటుంబంలో ఒక వ్యక్తి ఆధార్‌తో కూడిన ఈ-కేవైసీ తీసుకోనున్నారు. అలాగే బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకూ అవకాశం కల్పించారు.ఇక సిగ్నల్ లేని మారుమూల పల్లెల్లో మాత్రం ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి తర్వాత వాటిని ఆన్ లైన్‌లో పొందపరచనున్నారు. ప్రత్యేకంగా మొబైల్ యాప్.. కులగణన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసింది. రాష్ట్రంలోని దాదాపుగా 723 కులలా జాబితాను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా వర్గీకరించి మొబైల్ యాప్స్ రూపంలో అనుసంధానించారు. ఈ కులగణన ప్రక్రియలో నో క్యాస్ట్ ఆప్షన్ కూడా ఉండనే ఉంది. అంటే కులం గురించి చెప్పడం ఇష్టం లేనివాళ్లు, కుల పట్టింపులు లేనివాళ్లు నో క్యాస్ట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. #andhra-pradesh #started #process #caste-census మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి