/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/107.jpg)
Captain Rohit Robo Action While Receiving Trophy : ఎన్నో ఏళ్ళ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. వన్డే ప్రపంచకప్‌ను త్రుటిలో మిస్ అయినా టీ 20 వరల్డ్‌కప్ (T20 World Cup) ను మాత్రం చేతులతో పొదివి పట్టుకున్నారు. ఇందులో అందరి కంటే డిజర్వర్డ్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అందుకే మ్యచ్ గెలిచిన తర్వాత పట్టరాని ఆనందం, ఉద్వేగంతో గ్రౌండ్‌ను ముద్దాడుతూ ఏడ్చాడు రోహిత్. సహచరులను కౌగలింతలో ఎమోషనల్ అయ్యాడు ఇక కప్ అందుకుంటున్నప్పుడు అయితే పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు. కప్‌ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్‌లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ (BCCI) ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు.
View this post on Instagram