T20 World Cup : మనసులు గెలుచుకున్న దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. అన్నిరకాలుగా భారత జట్టుకు గట్టిపోటీని ఇచ్చింది. చివర వరకు పట్టువదలకుండా ఆడి విశ్వవిజేతలకు తాము ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పింది. By Manogna alamuru 30 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి South Africa Team : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలవడం అయితే టీమ్ ఇండియా (Team India) గెలిచింది కానీ మనసులను మాత్రం గెలిచింది దక్షిణాఫ్రికా జట్టే. టోర్నీ మొదలై దగ్గర నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చిన ప్రొటీస్ టీమ్ చివరి ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే స్పిరిట్‌తో ఆడింది. దాదాపు గెలవాల్సిన మ్యాచ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడం వలన ఓడిపోయింది. టీమ్ ఇండియా కేవలం 8 పరుగుల తేడాతోనే విజయం సాధించింది అంటే అర్ధం చేసుకోవచ్చును సౌత్ ఆఫ్రికా జట్టు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో. అన్ని రకాలుగా బాగా ఆడింది... బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్నింటిలోనూ సమానంగా రాణించింది ప్రోటీస్ టీమ్. భారత ఆటగాళ్ళ వికెట్లను టకటకా తీస్తూ వారి మీద ఒత్తిడిని పెంచడండో బౌలర్లు ఫుల్ సక్సెస్ అయ్యారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటంగ్ కు దిగిన బ్యాటర్లు కూడా విజృంభించేశారు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయారు. మొదటి రెండు వికెట్లు చాలా తొందరగా కోల్పోయినా ఎక్కడా తడబడలేదు. క్లాసెన్ అయితే చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఒకానొక టైమ్‌లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచేస్తుంది అన కూడా అనిపించింది.చివర్లో వికెట్లను కాపాడుకోవడంలో విఫలమవ్వడంతో మ్యాచ్‌ను ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే విశ్వ విజేతగా దక్షిణాఫ్రికా టీమ్ నిలవకపోయినా... క్రికెట్ (Cricket) అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. Also Read : VIRAT KOHLI: టీ20లకు స్టార్ బ్యాటర్ గుడ్ బై #t20-world-cup #cricket #team-india #south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి