Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.

Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
New Update

దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం(EC) పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (EVM) లలో పోలైన ఓట్లను వీవీప్యాట్ సిస్టమ్ స్లిప్‌లతో పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్‌ చేయాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసుపై విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Also read: పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం

ఎన్నికల కమిషన్ తమ సందేహాలను క్లారిఫై చేసింది.. కేవలం అనుమానాన్ని ఆధారంగా చేసుకుని ఆదేశాలు ఇవ్వలేమని.. అలాగే మీ ఆలోచనా విధానాన్ని మేము మార్చలేమని ధర్మాసనం తెలిపింది.EVM ఓటింగ్‌పై విపక్షాల అనుమానాలు, ఆందోళన నేపథ్యంలో ఈవీఎంలలో వేసిన అన్నీ ఓట్లను.. వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా ప్రింట్ అయిన పేపర్ స్లిప్‌‌లతో క్రాస్ చెక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈవీఎం పోలింగ్‌పై ప్రజల్లో కూడా అనుమానాలు తలెత్తాయని.. చివరికి యురోపియన్ దేశాలు కూడా బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్లిపోయాయని చెప్పారు. కానీ భారత్‌లోని అంశాలకు యూరప్‌ అంశాలకు చాలా తేడాలున్నాయని.. మన విధానాలను ఆ దేశాలతో పోల్చలేమని కోర్టు చెప్పింది.

కేసు విచారణ కోసం.. ఈసీ కూడా సమగ్ర వివరాలతో ఒక నివేదికను అందించింది. EVMలలోని మూడు యూనిట్లు (బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ) దేనికవే సొంతంగా మైక్రో కంట్రోలర్‌లు కలిగి ఉన్నాయని.. వీటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయొచ్చని ఈసీ తెలిపింది. అయితే ఈ మైక్రో కంట్రోలర్‌లు రీ-ప్రోగ్రామబుల్ ఫ్లాష్ మెమరీని కలిగి ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ వాదించారు. దీంతో ఈసీ సమర్పించిన టెక్నికల్ నివేదికను విశ్వసించాలని కోర్టు ఆయనకు సూచించింది. ఫ్లాష్ మెమరీ చాలా తక్కువగా ఉందని ఈసీ చెబుతోందని.. ఈవీఎంలలో ఉపయోగించేది సాఫ్ట్‌వేర్ కాదని, ఇది పార్టీ లేదా గుర్తును గుర్తించదని ధర్మాసనం తెలిపింది. చివరికి ఈ కేసులో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది.

Also read: టాయిలెట్‌గా మారిన హనుమాన్ టెంపుల్..పాకిస్తాన్‌లో అవమానం

#evm #2024-lok-sabha-elections #national-news #central-election-commission #teugu-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి