/rtv/media/media_files/2025/09/09/tariq-2025-09-09-09-46-28.jpg)
Congress Tariq Anwar
కుండపోత వర్షాల కారణంగా బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరదల కరణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద ప్రాంతాలను చూడ్డానికి ఈరోజు ప్రధాని మోదీకి కూడా ఇవాళ అక్కడ పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ రెండు రోజుల క్రితమే ఇక్కడ పర్యటించారు. ఇది చాలా మంచి విషయమే అయినా..అక్కడకు వెళ్ళిన తర్వాత తారిఖ్ ప్రవర్తించిన తీరు మాత్రం తీవ్ర వివాదానికి దారి తీసింది. అసలే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూసే బీజేపీ నేతలు...ఇది చూసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
బాధితుల భుజాలపైనే..
మామూలుగా అయితే వరద ప్రాంతాలకు పరామర్శకు వచ్చిన ఏ నేత అయినా అక్కడి ప్రజలతో పాటూ నీటిలో తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటారు. కానీ కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మాత్ర నీటిలో కాలు పెట్టకుండా జనం భుజాల మీద ఎక్కి తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయింది.
कटिहार के सांसद “तारिक अनवर” ! थोड़ा भी शर्म - लिहाज बाक़ी रहता, तो राजनीति छोड़ दिए होते ??
— Abhishek Singh (@Abhishek_LJP) September 8, 2025
pic.twitter.com/CdTHMUezX4
ఆరోగ్యం బాలేదు అందుకే..
దీనిపై బీజేపీతో సహా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఎంపీ తారిఖ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని..దానిని దృష్టిలో ఉంచుకునే గ్రామస్థులు స్వచ్ఛందంగా ఆయన్ను భుజాలపై మోసుకెళ్ళారని చెబుతోంది. కతిహార్ ఎంపీ తారీఖ్ అన్వర్.. వరద పరిస్థితిని అంచనా వేయడానికి రెండు రోజుల పాటు తన నియోజక వర్గంలో పర్యటించారు. ఇందులో ఆయన ట్రాక్టర్‌లు, పడవలు వంటి వివిధ రకాల రవాణా మార్గాలను ఉపయోగించారు. ఒకచోట బురద ఎక్కువగా ఉండడంతో వెహికల్స్ ముందుకు వెళ్లలేకపోయాయి. అక్కడి నుంచి అక్కడి నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఆయన చాలాసేపు ప్రయాణించారు. పైగా ఎండ ఎక్కువగా ఉంది. దాంతో తనకు తల తిరుగుతోందని చెప్పారు. అందుకే వృద్ధుడైన తారిఖ్ ను స్థానికులు భుజాల మీద మోసుకు వెళ్ళారని కతిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ వివరించారు. అయితే బీజేపీ మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. వి.వి.ఐ.పి. సంస్కృతి గా అభివర్ణించింది.