/rtv/media/media_files/2025/09/07/iphone-16-pro-price-drop-2025-09-07-15-40-22.jpg)
Iphone 16 Pro Price Drop
ఆపిల్ ఐఫోన్ అంటే చాలా మంది పిచ్చెక్కిపోతారు. ధర ఎంతున్నా కొనేందుకు అస్సలు ఆలోచించరు. లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. దానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అయితే కొందరు మాత్రం తమ జీవితంలో ఒక్కసారి అయినా ఐఫోన్ వాడాలని కలలు కంటుంటారు. కానీ అధిక ధర కారణంగా వెనక్కి అడుగులు వేస్తుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు, డిస్కౌంట్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని ప్లాన్ చేసుకుంటుంటారు. మరి మీరు కూడా అలాగే ఫీలవుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు ఐఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Iphone 16 Pro Price Drop
iphone 17 సిరీస్ లాంచ్‌కు మరో రెండు రోజులే మిగిలి ఉంది. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ iphone 16 Proపై భారీ తగ్గింపు లభిస్తోంది. అవునండీ మీరు విన్నది నిజమే. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ విజయ్ సేల్స్ ఈ ప్రీమియం ఫోన్ ధరను భారీగా తగ్గించింది. దాదాపు రూ.20 వేల కంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తోంది.
ఐఫోన్ 16 ప్రో మొబైల్ భారతదేశంలో లాంచ్ సమయంలో రూ.1,19,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఎక్కువ ధర కారణంగా ఈ మోడల్‌ను కేవలం హై-ఎండ్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు విజయ్ సేల్స్ మాత్రం దీనిని అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని కేవలం రూ.1,05,690కి మాత్రమే తన ప్లాట్ ఫార్మ్‌లో లిస్ట్ చేసింది.
అంటే డైరెక్ట్‌గా దాదాపు రూ.14,210 తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI లో కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.7,500 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ తగ్గింపుతో మొత్తం రూ.21వేలకు పైగా డిస్కౌంట్ పొందొచ్చు. ఈ రెండింటితో కలిపి IPHONE 16 PROను కేవలం రూ.98,190లకే సొంతం చేసుకోవచ్చు. దీంతో మొదటిసారిగా iPhone 16 Pro రూ.1 లక్ష కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
iPhone 16 Pro Specs
iPhone 16 Pro 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది A18 ప్రో ప్రాసెసర్, 8GB RAM, 1TB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే 48MP ప్రైమరీ + 12MP టెలిఫోటో + 48MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా అమర్చారు. అంతేకాకుండా 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 3582 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.