Whatsapp New Feature: ఇప్పుడు వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి, వాటిని షేర్ చేయవచ్చు అవును మీరు విన్నది నిజమే, వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. వాటిలో కొన్ని ఫీచర్లు ఇంకా ప్రయోగాత్మక దశలో ఉండగా, మరికొన్ని ఇప్పటికే వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో, వాట్సాప్ నుండి ఓ కొత్త ఫీచర్‌ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు, ఇది ప్రస్తుతం కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే! ఈ కొత్త ఫీచర్ ద్వారా, వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి, వాటిని షేర్ కూడా చేయవచ్చు. ఇప్పటివరకు, స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించి డాక్యుమెంట్లు స్కాన్ చేయడానికి సాధారణంగా థర్డ్-పార్టీ యాప్‌ల మీద ఆధారపడాల్సి ఉండేది. ఇప్పుడు వాట్సాప్‌లోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల, వినియోగదారులు ఇతర యాప్‌లను ఉపయోగించకుండానే ఈ ఫీచర్‌ను పొందవచ్చు. Also Read: స్టుపిడ్ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ ప్రస్తుతం, ఈ అప్‌డేట్ iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, కానీ త్వరలోనే Android యూజర్ల కోసం కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్ ద్వారా, వినియోగదారులు థర్డ్-పార్టీ స్కానింగ్ యాప్‌లతో పని లేకుండా వాట్సాప్‌లోనే స్కానింగ్ ఫీచర్ ఉపయోగించవచ్చు. ఈ వాట్సాప్ స్కానింగ్ ఫీచర్ అధిక క్వాలిటీతో ఉంటుందని సమాచారం. ప్రత్యేకంగా ఆఫీస్ డాక్యుమెంట్లను తరచూ షేర్ చేసే వారికి ఈ ఫీచర్(Whatsapp New Feature) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Also Read: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా..? మీ చాట్‌లో, మీరు డాక్యుమెంట్‌ను షేర్ చేయాలనుకున్న వ్యక్తిని లేదా గ్రూప్‌ను ఎంచుకోండి. షేర్ మెనూలో "డాక్యుమెంట్" ఎంపికను ఎంచుకోండి. అక్కడే "కెమెరా" ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవడం ద్వారా, మీరు డాక్యుమెంట్లను స్కాన్ చేయవచ్చు. డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత, అవసరమైతే కాంట్రాస్ట్ లేదా బ్రైట్‌నెస్ కూడా సెట్ చేయవచ్చు. ఇలా మీరు ఎడిట్ చేసిన డాక్యుమెంట్‌ను మీరు కోరుకున్న వారికి పంపవచ్చు. Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు