/rtv/media/media_files/2025/01/31/DpRStYNkfjmhbBdT2k9K.jpg)
vivo mobile phones now available on Zepto
ప్రముఖ టెక్ బ్రాండ్ వివో మరో అడుగు ముందుకేసింది. ఇకనుంచి తన ఫోన్లను ఇంటివద్దకే అందివ్వనుంది. ఇప్పటి వరకు వివో మొబైల్ కావాలంటే ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్‌లలో ఆర్డర్ పెట్టడం లేదా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడం చేసేవారు. ఇక ఇప్పుడు తమ ఫోన్ కొనుగోళ్లను మరింత సులభతరం చేసింది. ఇకనుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వివో ఫోన్లను కేవలం 10 నిమిషాల్లోనే ఇంటికి పంపించనుంది.
జెప్టోతో వివో డీల్
దీని కోసం వినూత్న ప్రయోగం చేసింది. వివో తన స్మార్ట్‌ఫోన్‌లను డోర్ డెలివరీ చేయడానికి క్విక్ కామర్స్ సర్వీస్ అయిన జెప్టోతో చేతులు కలిపింది. కస్టమర్లు త్వరిత డెలివరీ కోసం ఇప్పుడు ఇన్‌స్టంట్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జెప్టోలో ఎంపిక చేసిన వివో స్మార్ట్‌ఫోన్‌లను ఆర్డర్ చేయవచ్చు. దీంతో ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ డెలివరీ కానున్నాయి.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
మొబైల్‌పై రూ.5వేల డిస్కౌంట్
జెప్టో యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కస్టమర్‌లు ఆఫర్ కూడా పొందవచ్చు. పరిచయ ఆఫర్ కింద దాదాపు రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇకపోతే వివో Y18i, వివో Y29 5G ప్రస్తుతం ఢిల్లీ NCR, బెంగళూరుతో సహా ఎంపిక చేసిన నగరాల్లో డోర్‌స్టెప్ డెలివరీ కోసం జెప్టోలో లిస్ట్ చేయబడ్డాయి.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
వివో Y29 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,999 ధరగా ఉంది. అలాగే వివో Y18i ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల్లోనే Vivo స్మార్ట్‌ఫోన్‌లను డెలివరీ చేస్తామని Zepto పేర్కొంది.
పరిచయ ఆఫర్‌గా.. ICICI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 5,000 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్ కొనుగోళ్లపై కంపెనీ రూ. 5,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. Paytm, Amazon Pay, Cred సహా మరిన్ని మొబైల్ వాలెట్‌ల ద్వారా కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు డిస్కౌంట్‌లను పొందవచ్చు.