Ultraviolette Electric Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. మైలేజ్, ధర వివరాలివే!

అల్ట్రావయోలెట్ తన మొదటి స్కూటర్ అండ్ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. మొదటి 1,000 యూనిట్లకు షాక్‌వేవ్ ధర రూ.1.50 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని తర్వాత ధర రూ.1.75 లక్షలకు పెరుగుతుందని వెల్లడించింది.

New Update
Ultraviolette Shockwave Electric Bike

Ultraviolette Shockwave Electric Bike

అల్ట్రావయోలెట్ తన మొదటి స్కూటర్ అండ్ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే మొదటి 1,000 యూనిట్లకు షాక్‌వేవ్ ధరను రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఆ తర్వాత దీని ధర రూ.1.75 లక్షలకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది. కాగా షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో ఈ బైక్ కేవలం 2.9 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని వెల్లడించింది. 

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

అయితే దీని బ్యాటరీ సామర్థ్యం వెల్లడించలేదు.. అయినప్పటికీ ఈ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ 165 కిలోమీటర్ల ఆకట్టుకునే IDC మైలేజీని అందిస్తుందని తెలిసింది. ఇది 14.7hp గరిష్ట పవర్, 505Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ 120 కిలోల బరువు ఉంటుంది. ఇది చురుకైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Ultraviolette Shockwave Electric Bike 

ఇక ఈ బైక్ సస్పెన్షన్ విషయానికొస్తే.. ముందు భాగంలో 37mm USD ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్‌ను కలిగి ఉంటుంది. ఇవి వరుసగా 200mm, 180mm సస్పెన్షన్ ప్రయాణాన్ని అందిస్తాయి. దీని డిజైన్ విషయానికొస్తే.. షాక్‌వేవ్ రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి ఎల్లో/బ్లాక్, వైట్/రెడ్ కలర్‌లలో వచ్చాయి. ఇక బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. స్టాపింగ్ పవర్ కోసం 270mm ఫ్రంట్ డిస్క్, 220mm బ్యాక్ డిస్క్‌ను కలిగి ఉంది. అయితే ఈ మోడల్ కోసం డెలివరీలు 2026 నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

ఇకపోతే ఈ అల్ట్రావైలెట్‌ కంపెనీలో మొత్తం ఐదు రకాల ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అందులో స్పోర్ట్‌బైక్‌ల కోసం F, స్కూటర్‌ల కోసం S, తేలికైన బైక్‌ల కోసం L, అలాగే రెండు ఇతర ప్లాట్‌ఫారమ్‌లు - X, B ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యాచ్ వాహనాలు సేల్ అయిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అలా చేసే ముందు కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీని కారణంగా సేల్స్‌ను మరింత పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు