Stock Market Today: ప్రారంభంలోనే దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 నిమిషాలకు నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 23,715 వద్ద ఉండగా, సెన్సెక్స్ 208 పాయింట్లు ఎగిసి 78,192 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సల్సార్ టెక్నో, గో ఫ్యాషన్, జెన్ టెక్నాలజీస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

New Update
stock market today

stock market today

Stock Market Today: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. నిన్న కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అయితే ఉదయం 9:21 నిమిషాలకు నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు పెరిగి 23,715 వద్ద ఉండగా, సెన్సెక్స్(Sensex) 208 పాయింట్లు ఎగిసి 78,192 సమీపంలో ట్రేడ్ అవుతుంది. నేడు సల్సార్ టెక్నో, గో ఫ్యాషన్, జెన్ టెక్నాలజీస్, హాట్సన్ అగ్రో లాభాల్లో ట్రేడవుతుండగా, కావేరీ సీడ్స్, మంగళూరు రిఫైనరీస్, కోల్గేట్ పామోలివ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి:వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

వీటిలో ఇన్వెస్ట్ చేస్తే..

ఇదిలా ఉండగా ఐపీఎల్ సమయంలో కొన్ని రకాల స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను క్రికెట్ ప్రేమికులు ఎక్కువగా చూస్తుంటారు. మ్యాచ్ వస్తుందంటే ఇక టీవీల దగ్గరే ఉంటారు. అయితే ఈ సమయంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, క్విక్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ వ్యాపారాల్లో లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఐసీసీ ప్రపంచ కప్‌ను ఎలా అంతర్జాతీయగా వీక్షిస్తారో.. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా అలానే వీక్షిస్తారు. ఒక్కో జట్టులో కనీసం ముగ్గురు అయినా విదేశీ ఆటగాళ్లు ఉంటారు. వీరి వల్ల ఇతర దేశాల్లో కూడా మ్యాచ్‌లు చూస్తారు. దీంతో అక్కడి వారు ఇక్కడికి రావడం,  వీసా ట్రాకింగ్ కంపెనీలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. దీంతో మీరు ఈ ఐపీఎల్ సమయంలో జొమాటో, స్విగ్గీ, హోటళ్లు వంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

Advertisment
తాజా కథనాలు