Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.10 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తూ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి.

New Update
gold rates

బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తూ ధరలు(today gold prices) రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం, ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర మళ్లీ సామాన్యులకు భారంగా మారింది.

Also Read :  ఇంటింటికీ ప్రెస్టీజ్..  కిచెన్ మోఘల్ కు పద్మశ్రీ!

వెండి ధరలు కూడా పసిడి బాటలోనే

2026 జనవరి 26వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(today-gold-rate) రూ. 2,250 పెరిగి రూ. 1,49,150కు చేరుకుంది. ఇక   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.2450 పెరిగి రూ. 1,62,710కు చేరుకుంది.  కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. కేజీ బంగారం.. ఏకంగా రూ. 10  వేలు పెరిగింది. దీంతో ధర రూ. 3,75,000కు చేరుకుంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  చెన్నైలో 24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,63,910గా ఉంది. 22 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,50,250గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,62,710గా ఉంది. 22 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,49,150గా ఉంది. 

హైదరాబాద్ లో  24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,62,710గా ఉంది. 22 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,49,150గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,62,710గా ఉంది. 22 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.1,49,150గా ఉంది. 

ఇక వెండి చూస్తే.. చెన్నై, హైదరాబాద్ లో రూ . 3,75000గా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీలో రూ.3,40,000గా ఉంది. 

రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల బట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read :  మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

Advertisment
తాజా కథనాలు