Kushboo: బీజేపీ నన్ను పట్టించుకోవట్లేదు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడులో ఓ మీడియా సంస్థ తన పర్మిషన్ లేకుండా ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ చేయడంపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ఇంతగా దిగజారుతుందని తాను అనుకోలేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ తనను పట్టించుకోవట్లేదనేది నిజమేనని ఆమె కుండ బద్ధలు కొట్టారు. 

author-image
By srinivas
New Update
Khushboo

Khushboo

Kushboo: నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ తమిళనాడుకు చెందిన ఓ మీడియా సంస్థపై తీవ్రంగా మండిపడింది. తన పర్మిషన్ లేకుండా ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఏలా రికార్డు చేశారంటూ కడిగిపారేసింది. మరి ఇంతలా దిగజారిపోతారని తాను ఊహించలేదంటూ విమర్శలు గుప్పించింది. 

బీజేపీ నన్ను పట్టించుకోవట్లేదు..

అసలేం జరిగిందంటే.. తమిళనాడుకు చెందిన ఒక మీడియా సంస్థ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్లకు దూరంగా ఉండటంపై ఆమెను ఫోన్ ద్వారా ప్రశ్నించింది. దీంతో బీజేపీ తనను సరిగా పట్టించుకోవట్లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆమె మాటలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె అనుమతితోనే విడుదల చేస్తున్నట్లు మీడియా సంస్థ పేర్కొంది. కానీ అది వైరల్ కావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఖుష్బూ.. తన అనుమతి లేకుండా వాయిస్‌ ఎలా రికార్డు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: TG News: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్

ఇంతగా దిగజారుతుందని అనుకోలేదు.. 

'నేను చెప్పింది నిజమే. బీజేపీ కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఒకవేళ చెప్పాలనుకున్నా చివరి నిమిషంలో ఇన్ఫామ్ చేస్తారు. అయితే నేను పార్టీని వీడట్లేదు. ప్రధాని నరేంద్రమోదీ విజన్‌, ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఇక మీడియా ఇంతగా దిగజారుతుందని నేను అనుకోలేదు. నాకు చెప్పకుండానే ఫోన్ కాల్ రికార్డ్ చేసి పైగా నేను చెప్పానని అబద్ధాలాడుతున్నారు' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు