Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నిన్నటితో పోలిస్తే నేడు స్టాక్ మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 9 పాయింట్ల నష్టంతో 78,007 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ22 పాయింట్ల లాభంతో 23,690 వద్ద ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

New Update
stock market

stock market

నేడు స్టాక్ మార్కెట్లు కాస్త ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు స్టాక్ మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 9 పాయింట్ల నష్టంతో 78,007 వద్ద ట్రేడవుతుంది. ఇక నిఫ్టీ22 పాయింట్ల లాభంతో 23,690 వద్ద ఉంది. నేడు సెన్సెక్స్ 30 సూచీలో కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

ఈ  షేర్లు లాభాల్లో..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

గత వారం రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఈ రోజే కాస్త ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. అయితే ఇలా వారం రోజులు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటానికి కూడా ఓ కారణం ఉంది. ట్రంప్ సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చాలా మంది అంచనాల వల్ల షేర్లు పెరుగుతున్నాయి. 

ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విక్టరీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు