/rtv/media/media_files/2025/08/24/ipo-2025-08-24-09-15-43.jpg)
IPO
సోమవారం నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కాసుల వర్షం కురవబోతోంది. దీనికి కారణం నలభైకు పైగా కంపెనీలు స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ల ద్వారా తమ పెట్టుబడి దారులకు బహుమతులు ఇవ్వబోతున్నాయి. ఈ కంపెనీలన్నీ డివిడెండ్లను పంపిణీ చేయనున్నాయి. ఇందులో హెచ్డీఎఫ్ సీ, క్రెటో సిస్కోతో సహా అనేక కంపెనీలు ఈ బోనస్ షేర్లను ఇవ్వబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్ఎఫ్డీసీ 1:1 బోనస్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 26, 27 తేదీల్లో వీటిని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనితో పాటు, DMR హైడ్రో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 8:5 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా జారీ చేయనుంది. అదే సమయంలో క్రెటో సిస్కాన్ లిమిటెడ్ బోనస్ వాటా 2:25 నిష్పత్తిలో ఉండనుంది.
50కి పైగా కంపెనీలు డివిడెండ్లు..
మొత్తానికి 50కు పైగా కంపెనీలు వచ్చే వారం డివిడెండ్లు పంపిణీ చేయనున్నాయి. వీటిలో తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, రూపా & కంపెనీ లిమిటెడ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, నితిన్ కాస్టింగ్స్ లిమిటెడ్, కామా హోల్డింగ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటూ వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, NBCC, ప్రాక్టర్ & గ్యాంబుల్, జిలెట్ ఇండియా కూడా బోనస్ షేర్లు ఇవ్వనున్నాయి. దీనిలో పెట్టుబడి దారులు అతి ముఖ్యంగా గుర్తుచుకోవలసిన విషయం ఏంటంటే..ప్రాక్టర్ & గాంబుల్ రూ.65 డివిడెండ్ ప్రకటించగా, మరోవైపు జిల్లెట్ ఇండియా తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుకు రూ.47 డివిడెండ్ ఇస్తోంది. దీంతో వచ్చే వారం అంతా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు పండుగలా మారనుంది. వినాయకచవితి సంబరాలు చేసుకోనున్నారు.
Also Read: America-Pakistan: అమెరికా-బిన్ లాడెన్- పాక్..గతం మర్చిపోయారు...జైశంకర్ కీలక వ్యాఖ్యలు