social media users: సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్రం బిగ్ అలర్ట్

సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది.

author-image
By Kusuma
New Update
Password Users

Password Users

సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది. అలాగే సిస్టమ్స్ లను లేటెస్ట్ వెర్షన్లకు అప్ గ్రేడ్ చేసుకోవాలని కూడా సూచించింది.

ఇది కూడా చూడండి:Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

కోట్లకు పైగా పాస్‌వర్డ్‌లు..

1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్‌గా నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్‌న్యూస్‌, ఫోర్బ్స్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది విస్తృతమైన ఫిషింగ్‌ స్కామ్‌లు, ఐటెంటిటీ థెఫ్ట్‌, ఆన్‌లైన్‌ ఖాతాల హ్యాకింగ్‌కు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

లీకైన సమాచార వివరాల్లో కొత్తవి, డిటైల్‌గా ఆర్గనైజ్‌ చేసినవి ఉన్నాయట. ఇన్ఫోస్టీలర్లు అని పిలిచే ఒక రకమైన మాల్‌వేర్‌ ద్వారా డేటా చోరీ జరిగినట్లు సెక్యూరిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఈ మాల్‌వేర్‌ ప్రోగ్రామ్‌లు ప్రజల డివైజ్‌ల నుంచి సైలెంట్‌గా యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లను దొంగలించి హ్యాకర్లకు పంపుతాయి. ఆ వివరాలను హ్యాకర్లు నేరుగా ఉపయోగిస్తారు. లేదంటే డార్క్‌ వెబ్‌ వేదికల్లో అమ్ముకుంటారు.

ఇది కూడా చూడండి:Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

Advertisment
తాజా కథనాలు