/rtv/media/media_files/2025/09/01/prices-2025-09-01-08-54-00.jpg)
Prices
మీరు ఎప్పుడైనా గమనించారా? సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు ఇలా ఎక్కడ చూసుకున్నా చాలా వస్తువుల ధరలు 50, 100, 200 వంటి రౌండ్ నంబర్లలో ఉండవు. 49, 99, 199, 999 వంటి బేసి సంఖ్యలలో ఉంటాయి. అయితే వస్తువుల ధరలు ఇలా పెట్టడానికి ఏదైనా కారణం ఉందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? మరి ఎందుకు ధరలు ఇలా పెడతారో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!
తక్కువ ధరలు
మానవ మెదడు ధరను చూసినప్పుడు మొదటి అంకెను మాత్రమే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ. 99 ఉందంటే అది 100 కంటే తక్కువగా ఉన్నట్లే. అదే ఆ వస్తువు ధర రూ.100 ఉంటే దాని ధర ఎక్కువగా ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. అయితే ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. కేవలం రూపాయి మాత్రమే ఉంది. కానీ మన మెదడు ఎక్కువగా తక్కువ ధర ఉన్న రూ.49, రూ.99 వంటి వాటినే గుర్తించడం వల్లే వీటిని పెడుతుంటారు. దీనివల్ల తక్కువ ధర ఉందని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఉద్దేశంతోనే ఇలా పెడతారు.
డిస్కౌంట్ ఉందని..
రూ.49, రూ.99 ఇలా ఉంటే డిస్కౌంట్ ఉందని, ఆఫర్‌లో వస్తున్నాయని వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. ఈ డిస్కౌంట్ వల్ల తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయవచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఆలోచిస్తారు. దీనివల్ల వ్యాపారులకు ఎక్కువగా సేల్ అయ్యి లాభాలు వస్తాయి. అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.
లాభాలు వస్తాయని..
ఉదాహరణకు రూ.49 ధర ఉన్నప్పటికీ అది రూ.50 రూపాయలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తేడా. కానీ వేల సంఖ్యలో జరిగే అమ్మకాలపై భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు ఒక వస్తువు రూ. 99కి బదులుగా రూ. 100కి అమ్మితే వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రూ. 99కి అమ్మడం వల్ల అమ్మకాలు పెరిగి చివరికి దుకాణానికి అధిక లాభాలు వస్తాయి.
చిల్లర మార్పు
రూ.49, రూ.99 అని ధరలు ఉంటే వినియోగదారులు ఆ రూపాయి చిల్లరను తీసుకెళ్లరు. దీనివల్ల వ్యాపారులకు భారీ మొత్తంలో లాభాలు వస్తాయి. అయితే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కావడం వల్ల పెద్ద మొత్తంలో లాభాలు రావడం లేదు. కానీ నెట్ క్యాష్ ఉపయోగించే వారి దగ్గర అయితే ఒక్కో కస్టమర్ దగ్గర రూపాయి ఉంటే భారీ లాభాలు వస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలు కోసం మీరు సంబంధించిన నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: September Bank Holidays : సెప్టెంబర్ వచ్చేసింది.. 15 రోజులు బ్యాంకులు బంద్