ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. అందువల్లనే అప్పు చేసి అయినా ఈ ఫోన్‌ను కొనేస్తున్నారు. ధర ఎంతున్నా కొనేందుకు వెనుకాడటం లేదు. కొత్త సిరీస్ వస్తుందంటే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది మరి ఐఫోన్‌కు. ఇక మరికొందరు మాత్రం ఐఫోన్‌ను కొనాలని ఎప్పట్నుంచో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. కానీ అధిక ధర వల్ల ఎప్పుడైనా ఆఫర్లు ఉంటే కొనుక్కోవచ్చులే అని వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. Also read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు అతి తక్కువ ధరలోనే ఐఫోన్ 15 ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఇప్పుడంతా సంక్రాంతి ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. iPhone 15 Price Also Read: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్ iPhone 15 మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉంది. అందులో 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో బేస్ 128జీబీ వేరియంట్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ.69,900 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిపై 13 శాతం అంటే రూ.9,014 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఐఫోన్ 15 ఫోన్ కేవలం రూ.60,499లకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. iPhone 15 Bank Offers Also Read : అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. HDFC Bank క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై దాదాపు రూ.1200 తగ్గింపు పొందొచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ.38,150 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో ఐఫోన్ 15 ఫోన్ కేవలం రూ.21,149కే కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే.. ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మోడల్ బట్టి ధరను నిర్ణయిస్తారు. అంతేకాకుండా ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాంటప్పుడే ఈ ఎక్స్ఛేంజ్ మొత్తం వర్తిస్తుంది. లేదంటే మీ జేబు నుంచి మరింత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. iPhone 15 Features Also Read : మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్ ఈ ఫోన్ 6.1 inch సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 48ఎంపీ + 12ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. A16 Bionic చిప్‌సెట్, 6 Core ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.